పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను అభివృద్ధి చేయండి : ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు


కాకినాడ జిల్లా పెద్దాపురం, సామాజిక స్పందన

కాకినాడ జిల్లాలో గల పెద్దాపురం నియోజవర్గం, పెద్దాపురం పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఏరియా హాస్పిటల్ గా మార్పు చేయుటకు, దానికి అనుగుణమైన సిబ్బందిని నియమించుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ ఐ. వెంకటేశ్వరరావు గారు ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి మరియు వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు శ్రీమతి విడదల రజినీ గారికి లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. శాసన మండలి సమావేశాల్లో కూడా ఈ అంశం లేవనెత్తుతామని తెలిపారు.

############# మరిన్ని వార్తలు ############

మున్సిపాల్టి ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి అంటూ ఎమ్.ఎల్.ఎ చినరాజప్ప కి మరియు ఇన్ చార్జ్ దొరబాబు కి వినతి పత్రం అందించిన మున్సిపాల్టి ఇంజనీరింగ్ కార్మికులు

పెద్దాపురం పట్టణం, సామాజిక స్పందన

 ఇంజనీరింగ్ విభాగంలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న 15 వేల మంది కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని, వారు చేస్తున్న ప్రమాదకరమైన పనిని, శ్రమశక్తిని గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్, హెల్త్ రిస్క్ అలవెన్స్ టి.ఎ, డిఎలు ఇవ్వాలని కోరుతూ ఎ.పి. మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో పెద్దాపురం నియెాజకవర్గం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, నియెాజవర్గ ఇన్ చార్జ్ దవులూరి దొరబాబుకు వినతిపత్రం అందజేసారు. 


ఈ సందర్బంగా సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రమణ లు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు కరెంట్, ఆర్టీసి చార్జీలు, చెత్తపన్నుతో సహా నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని, ఇంజనీరింగ్ కార్మికులు చాలీచాలని జీతాలతో, ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేక సరైన తిండికి కూడా నోచుకోక అవస్థలు పడుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో సంక్షేమ పధకాలు అమలుచేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పనిచెయ్యకుండా ఆపేసిందని అన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల శ్రమను గత ప్రభుత్వం లాగే ఇప్పటి ప్రభుత్వం కూడా గుర్తించకుండా అవమానపర్చడం కార్మికులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నదని అన్నారు. శాసన సభ్యులు తమ సమస్యలను శాసన సభలో ప్రస్ధావించాలని, అలాగే ఇన్ చార్జ్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు .ఇంజనీరింగ్ కార్మికులందరికీ హెల్త్ అలవెన్స్ చెల్లించాలని, ఇంజనీరింగ్ మరియు పారిశుధ్య కార్మికులను ఆప్కాస్ నుండి మినహాయించి, గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగారి హామీ మేరకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, సంక్షేమ పధకాలు అమలు చేయాలని డిమాండ్ చేసారు. 

ఈ కార్యక్రమంలో రమణ, నాగేశ్వరరావు, మహాపాతిన పాపారావు, బాసిన వీరభద్రరావు, ఐ స్వామి, ఎస్ నాగేశ్వరరావు, బి రవి కుమార్, టి సాయి, బి.భదర్రావు తదితరులు పాల్గోన్నారు.

@@@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@@

భవన నిర్మాణ కార్మికుల జిల్లా మహాసభలలో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్


పెద్దాపురం, సామాజిక స్పందన

ఎ.పి. బిల్డింగ్ & అధర్ కనస్ట్రక్షన్ వర్కర్స యూనియన్ (సిఐటియు) జిల్లా మహాసభలు సెప్టెంబర్ 29,30 అక్టోబర్ 1 వ తేదీలల్లో మూడు రోజుల పాటు జరుగుతున్నాయని సిఐటియు జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘం పెద్దాపురం మండల విస్తృత సమావేశం గడిగట్ల సత్తిబాబు అధ్యక్షతన యాసలపు సూర్యారావు భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాజ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ఉన్న అన్ని రంగాల కార్మికుల మహాసభ జరగబోతుందని తెలిపారు. ఇప్పటికే భవన నిర్మాణ రంగం మీద ప్రభుత్వం చాలా చిన్న చూపు చూపుతుందని అన్నారు. ఇసుక సమస్యను సృష్టించి పనులు కొల్పోయెాలా చేసిందని ఇప్పుడు ఏకంగా 3 సంవత్సరాల కాలంగా సంక్షేమ బోర్డును నిలుపుదల చేసిందని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం భవన నిర్మాణ రంగంలో కేవలం 20 నుండి 30 శాతం మందికి మాత్రమే అందుతుందని తెలిపారు. సంక్షేమ పధకాలతో సంబంధం లేకుండా సంక్షేమ బోర్డును అమలు చేయ్యాలని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహాసభలు సెప్టెంబర్ 29వ తేదీన ఫోటో ఎగ్జిబిషన్, 30వ తేదీన కళారూపాల ప్రదర్శన, అక్టోబర్ 1వ తేదీన ప్రతినిధుల సభ జరుగుతాయని తెలిపారు. మహాసభల జయప్రదానికి అందరూ సహకారం అందించాలని విజ్ఞప్తి చేసారు. 

సమావేశంలో సిఐటియు కార్యదర్శి దాడి బేబి, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నీలం శ్రీను, తైనాల శ్రీను, గూనూరి రమణ, అప్పారావు, చందు, వడ్డి సత్యనారాయణ, వామిశెట్టి స్వామి, రవి, మాగాపు నాగు, రేలంగి వెంకట్రావు, తాడిశెట్టి గంగ, క్రాంతి కుమార్ తదితరులు పాల్గోన్నారు..

   @@@@@@ మరిన్ని వార్తలు @@@@@@@

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్దాపురం లో బంద్ 

పెద్దాపురం, సామాజిక స్పందన

 విద్యారంగ సమస్యల పరిష్కరణకై ఎస్ఎఫ్ఐ, పి.డి.ఎస్.యు సంఘాల ఆధ్వర్యంలో బంద్ విజయవతమైంది. ఈ సందర్భంగా SFI మండల అధ్యక్ష కార్యదర్శులు S.లలితాదేవి, ఆర్.అరుణ్ కుమార్ , పి.డి.ఎస్.యు నాయకులు వి. అర్చన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 40 రోజులవుతున్న నేటికీ పూర్తిస్థాయిలో జగనన్న విద్యా కానుక అందించలేదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మూడేళ్లయిన నేటికీ విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలు పెంచలేక పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన విద్యా విధానం పేరుతో పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానం అమలు కాకపోయిన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలలో భాగంగా 3,4,5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తుందన్నారు. 3,4,5 తరగతులు విలీనం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8,000 పాఠశాలలో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. మన జిల్లాలో 174 ప్రాథమిక పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ అమ్మ ఒడి, విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు ప్రొఫెసర్ లెక్చరర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు దోపిడీని అరికట్టాలని ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని విద్యార్థులు ప్రతిష్టంగా అమలు చేయాలని కోరారు. బైజుస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులు అందరికీ పూర్తి ఫీజులు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు విన్నాడాలని అందరికీ విద్య అందుబాటులోకి ఉండే విధంగా చూడాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో SFI మండల నాయకులు విశ్వ , రవీంద్ర, అమృర్త , నమ్రత, రోజా , లోవరాజు , మనోహార్ , నియాజ్ , గౌస్ , మనోజ్ , వివేక్ , రఫీ PDSU నాయకులు చిట్టిబాబు , బాలరాజు , ప్రగతి , ఉదయ్ కిరణ్ , ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.